నెట్ ఫ్లిక్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్ హారర్ థ్రిల్లర్! కామెడీ టచ్ తో సాగే..
Tue Jun 03, 2025 20:10 Entertainment.202506032108.jpg)
హారర్ థ్రిల్లర్ జోనర్ కి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ జోనర్ నుంచి కొత్తగా ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ దిగిపోతూనే ఉంటుంది. ఒకవేళ కొత్తగా ఈ జోనర్ నుంచి ఏ సినిమా రాకపోయినా, గతంలో వచ్చిన హారర్ థ్రిల్లర్స్ లో ఏది ఎక్కువగా కనెక్ట్ అవుతుతుందనేది సెర్చ్ చేస్తూ వెళతారు. అలాంటి వారికి కామెడీ టచ్ తో సాగే తమిళ హారర్ థ్రిల్లర్ ఒకటి నచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఆ సినిమా పేరే 'కట్టేరి' .. అంటే 'రక్తపిశాచి' అని అర్థం. జ్ఞానవేల్ రాజా - ఎస్ ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమాకి, డీకే దర్శకత్వం వహించాడు. ఎస్ ఎన్ ప్రసాద్ నేపథ్య సంగీతాన్ని అందించిన ఈ సినిమా, 2022 ఆగస్టులో థియేటర్లకు వచ్చింది. థియేటర్స్ నుంచి ఓ మాదిరి రెస్పాన్స్ ను రాబట్టుకున్న ఈ సినిమా, ఆ తరువాత ఓటీటీ వైపుకు వచ్చింది. అలా ఓటీటీలో అడుగుపెట్టినప్పుడు ఎంతమంది చూశారోగానీ, ఈ మధ్య కాలంలో ఈ సినిమాను ఎక్కువ మంది చూస్తూ వెళుతుండటం గమనించవలసిన విషయం. వరలక్ష్మి శరత్ కుమార్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ అంటున్నారు. కథ విషయానికి వస్తే .. అది అడవికి ఆనుకుని ఉన్న ఒక గ్రామం. ఆ విలేజ్ లో మత్తమ్మ (వరలక్ష్మి శరత్ కుమార్) ఆమె చెల్లెలు కలిసి నివసిస్తూ ఉంటారు. ఆ ఇంటి పెరటిలో ఒక పెద్ద బావి ఉంటుంది. ఆ బావిలో ఒక రక్తపిశాచి ఉంటుంది. ఆ పిశాచికి ఆహారంగా ఆ బావిలోకి ఎవరినైనా తోసేస్తే ఆ ఎత్తు బంగారాన్ని ఆ పిశాచి పైకి పంపుతూ ఉంటుంది. ఈ విషయం ఒక పోలీస్ ఆఫీసర్ కి తెలుస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ నిధి కోసం ఆ ఊరికి చేరుకున్న హీరో బ్యాచ్ కి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? అనేది కథ.
ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?
ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?
జూన్‌లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!
బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!
'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!
వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!
రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!
ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!
రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!
ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!
పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #VaralaxmiSarathkumar #Katteri #Netflix #Tamilhorrorthriller #horrormovie #OTTplatform #bloodthirsty #ghostGnanavelRaja #SRPrabhu
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.